సిపిఎం జనచైతన్య యాత్ర పోస్టర్ విడుదల

 

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి మార్చి 15:

మతోన్మాద కార్పొరేట్ విధానాలను వ్యతిరేకిస్తూ సంక్షేమం, మతసమారస్యం, ప్రజాస్వామ్యం, సామజిక న్యాయం కోసం పోరాడేందుకు సీపీఎం ఆధ్వర్యంలో తెలంగాణ, రాష్ట్రం లో మార్చి 17 నుండి 29 వరకు జరిగే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలనీ కోరుతూ బెస్తంచెరువు భూ పోరాట కేంద్రం వద్ద రంగశాపేట్ ఏరియా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈసందర్బంగా సిపిఎం రంగశాయిపేట్, ఏరియా కమిటీ సభ్యులు ధర్మారపు సాంబమూర్తి మాట్లాడాతు బిజెపి అధికారం లోకి వచ్చినప్పటి నుండి కార్పొరేటర్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు కట్టాబేడుతూ, ప్రజలపై భారలు మోపుతూ 23 కోట్లమందిని పేదలగా చేశారు. నిత్యవసర వస్తువుల సరుకుల ధరలు మూడు రేట్లు పెంచి ధర ల పెరుగుదల వల్ల కార్పొరేట్, సంస్థలకు వేల కోట్ల రూపాయలను లాభాలను పోగు చేసుకునేలా చేసారు. ప్రభుత్వ రంగా సంస్థలను ప్రయివేట్ పరం చేస్తూ నిరుద్యోగ యువతకు ఉపాధి లేకుండా చేశారు. ఒకే దేశం, ఒకే పన్ను పేరుతో, జీఎస్టీ విధించి, ప్రజలను దోచుకుంటున్నారు. బిజెపి యేతర రాష్ట్రాలను, లొంగ తీసుకునేందుకు దాడుల పేరుతో బెదిరిస్తున్నారు. కార్పొరేట్ మతోన్మాద విధానాలతో మతసామరస్యానికి తూట్లు పొడుస్తూ, ప్రజాస్వామ్య విలువలకు విగాదం కలిగిస్తూ సామాజిక న్యాయాన్ని తుంగలోకి తొక్కి బిజెపి విధానాలపై ప్రజలను చైతన్యం చేసేందుకు, జరుగుతున్న జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని మార్చి 17న వరంగల్ లో జరిగే ప్రారంభ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా కమిటీ సభ్యులు మాలోత్ ప్రత్యూష, మన్నూరు జ్యోతి, శాఖ కార్యదర్శిలు ఉసిల్ల దీప, కేశ బోయిన రాజు, బొక్క చిరంజీవి, వడ్లకొండ జ్యోతి, తాటిపాముల ఉదయ్ శ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking