* రౌండ్ టేబుల్ సమావేశం లో పలు సంఘ నాయకుల అవెదన
* 9సంవత్సరాల బిజెపి పాలనలో అట్టడుగు వర్గాల కు, బహుజనలకు తీరని అన్యాయం .,
…తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్
సంగారెడ్డి మార్చి:24 ప్రజ బలం ప్రతినిది:
బిజెపి మతోన్మాద కార్పోరేట్ విధానాలకు వ్యతిరేకంగా వస్తున్న సిపిఎం జన చైతన్య యాత్ర సందర్భంగా రౌండ్ బిజెపి సమావేశం నిర్వహించడం జరిగింది: సమావేశంలో తెలంగాణ సోషల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎల్ వేణుగోపాల్* పాల్గొని మాట్లాడుతూ, 9 సంవత్సరాల బిజెపి పాలనలో అట్టడుగు వర్గాల వారు, బహుజనలకు తీరని అన్యాయం జరిగిందని, సంక్షేమ ఫలాలు ఆమడ దూరంలో ఉన్నాయని బీజేపీ ప్రభుత్వం గొప్పగ చెబుతున్న పాలనలో, దళితులపై దాడులు ఏమిటి అని అన్నారు, ఇపటికైన ప్రజలు ఈ దాడులకు పాల్పడిన బీజేపీ ప్రభుత్వనికి తగిన విధంగా బుద్ది చెప్పాలని, ప్రభుత్వ సంస్థలు అమ్ముచున్న, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తూ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ కల్పించకుండా డీజిల్ పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచుకుంటూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నా ఈ ప్రభుత్వాలుకి నిలదీయాల్సిన అవసరం ఉంది, ప్రజలు చైతన్యవంతులై ఎదిరించి,ఉద్యమించే దిశగా ముందుకు వెళ్లాలని వారన్నారు, ఈ కరెక్రమలో, సభ అధ్యక్షులు అశోక్,
ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు కె.ఇమ్మాయ్యా,
కెపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అధ్యక్షులు అతిమెల.మాణిక్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్, వ్య,క,సా, జిల్లా అధ్యక్షులు నర్సింహులు, సిఐటియు యాదగిరి, పోతురాజు పవర్ ప్రవీణ్ సంచుల అందే.మొగులయ్య లంబాడి హక్కుల పోరాట సంఘం సురేష్ తదితరులు పాల్గొన్నారు.