నేడు భద్రాచలం నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి 24 (ప్రజాబలం) భద్రాచలం నియోజకవర్గ స్థాయి పొంగులేటి శీనన్న అభిమానుల ఆత్మీయ సమ్మేళనం ఈ నెల 25న శనివారం భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరగనుంది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జీ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.00 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ సమ్మేళనానికి భద్రాచలం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని దయాకర్ రెడ్డి కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking