త్వరలో ప్రసారం కానున్ననాగపంచమి సీరియల్‌

నెల్లూరు మార్చ్ 24 :నాగదేవతగా పాములను కొలిచే మనిషి, ఆ పామును చూడగానే విష సర్పంగా భావించి చంపేయడానికి సిద్ధమవుతాడు. పగబట్టిన పాము, మనిషి బంధం చూపుతూ ఎన్నో కథలు చాలామందికి తెలుసు. సైన్స్‌ , అసలు పాములు పగబట్టవని , అదంతా ఉత్తిదే అని కొట్టి పడేస్తే, నమ్మకాలు మాత్రం అబ్బే, పాములు పగబడతాయి, తమకు అనుభవాలున్నాయనే వారు కొందరు. పాములకు, మనుషులకు మధ్య ఈ పగ,ప్రతీకారాలేనా ? ఇంకేమీ లేవా ? అని అంటే చాలానే ఉన్నాయి. ఆ బంధాలనే తాము చూపుతామంటూ స్టార్‌ మా వినూత్నమైన కథనంతో నాగపంచమి సీరియల్‌తో వస్తుంది. పాలు పోసి కాపాడమ్మా అని నిర్మలమైన మనసుతో ప్రార్ధిస్తే చాలు తానున్నాననే నాగదేవత కథనంతో తీర్చిదిద్దిన ఈ సీరియల్‌ స్టార్‌ మాలో మార్చి 27 నుంచి రాత్రి 8 గంటలకు ప్రసారం కాబోతుంది.
ఈ నేపథ్యంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భక్తుల పూజలనందుకుంటున్న నాగేంద్రుని పలు ఆలయాలతో పాటుగా అతి ముఖ్యమైన దేవాలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకుంది స్టార్‌ మా లో ప్రసారం కానున్న నాగపంచమి సీరియల్‌ బృందం. దీనిలో భాగంగా ఈ రోజున నెల్లూరులో కనుపర్తిపాడు వద్ద ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంను సందర్శించింది ఈ బృందం. సంతానం లేని జంటలకు కొంగుబంగారంగా వెలుగొందుతుండటమే కాదు, పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు , ఎలాంటి దుష్టశక్తులూ తమ మీద పడకుండా నిత్యం తమను కాపాడతాడని ఈ ప్రాంత భక్తులు వల్లీదేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకుంటుంటారు. ఈ దేవాలయాలను దర్శించి, భక్తులతో ముచ్చటించిన నాగపంచమి బృందం, ఈ నెల 27 నుంచి స్టార్‌మా లో ఈ సీరియల్‌ ప్రసారం కానుందని, గతంలో ఎన్నడూ చూడని నాగదేవత కథతో ఇది ప్రసారం కానుందని వెల్లడించింది. స్వామి వార్ల తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఈ బృందం మరో రెండు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking