ఈ కుబేర్లోని అన్ని పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలి
కలెక్టరేట్ ఎదుట యు.ఎస్.పి.సి. నిరసన
జగిత్యాల, మార్చి 24: నిర్ణిత సమయానికి వేతనాలు రాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులకు పడుతున్నారని ప్రతినెలా ఒకటిన వేతనాలు విడుదల చేయాలని, ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను మార్చి చివరికి చెల్లించాలని యూఎస్పీసి జగిత్యాల జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట యు.ఎస్.పి.సి. జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి అనంతరం జిల్లా ట్రెజరీ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూఎస్పీసి నాయకులు మాట్లాడుతూ ధనిక రాష్టమని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వేతనాలకై కేటాయింపులు చేస్తున్నా ప్రతినెలా ఒకటిన వేతనాలు, పెన్షన్లు చెల్లించడం లేదన్నారు. సప్లిమెంటరీ వేతనాలు, సెలవు జీతాలు, బీమా సొమ్ము, జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ పేమెంట్స్, లివ్ ఎన్ క్యాష్, పీఆర్సీ బకాయిలు, మెడికల్ రీ ఎంబర్స్మెంట్, పెన్షన్ బకాయిలు వంటి బిల్లులన్ని నెలల తరబడి మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు, యూఎస్పీసి ప్రభుత్వానికి, ఆర్ధిక శాఖకు నివేధించామని ఎలాంటి ఫలితం లేదని వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్నా బకాయిలు మంజూరు చేసేందుకు ఆర్థిక శాఖ చొరవచూపడం లేదన్నారు. ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి యూఎస్పీసి రెండు దశల్లో ఉద్యమ కార్యాచరణ తీసుకొందని అందులో మొదటి భాగంగా రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి డి.టి.ఓ.కు వినతిపత్రం అందజేశామన్నారు. పెండింగ్ బిల్లులు వెంటనే మార్చి చివరి వరకు క్లియర్ చేయాలని, ప్రతినెలా ఒకటినే వేతనాలు చెల్లించాలని ఇలా జరగని పక్షంలో ఈ నెల 28 న హైద్రాబాద్ లోని ఇందిరాపార్క్ జరిగే మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూఎస్పీసి నాయకులు తిరు కోవెల శ్యాంసుందర్, బోగ రమేష్, ఎన్నం రాంరెడ్డి, దూమాల శంకర్ బాబు, మంతెన కౌశిక్ కుమార్, అంబటి భూమేశ్వర్, కొక్కుల రామచంద్రం, నరేందర్, గొడుగు రఘుపతి యాదవ్, తులసి ఆగమయ్య, వేణుగోపాల్, ఎడ్ల గోవర్ధన్, రామ్ నరేష్, ప్రసాద్, సత్యనారాయణ, రాచమల్ల మహేష్, గండి రాజయ్య, అప్పాల గంగయ్య,వెయ్య లచ్చన్న,వేముల సుధాకర్, జాన్ వెస్లీ, ఫక్రుద్దీన్, జి.చంద్రమౌళి, కొత్త రామ్ కుమార్, చిలుక రవీందర్, జిడ్డిగి మనోహర్ తదితరులున్నారు.