డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ మున్సిపాలిటీ కొత్త మాస్టర్ ప్లాన్ అమలుపై కుప్పలు తిప్పలుగా అవాంతరాలు వచ్చినా దాన్ని నిలుపుదల చేస్తున్నట్టే చేసి, మళ్లీ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోసం జీవో జారీ చేశారని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నిర్మల్ వస్తున్న సందర్భంగా ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. కామారెడ్డి, జగిత్యాల మున్సిపాలిటీల పరిధిలో సైతం మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాలు వస్తే అక్కడ పూర్తిగా నిలుపుదల చేశారని ఇక్కడ మాత్రం నిలుపుదల చేసినట్లే చేసి మళ్లీ అమలుపరుస్తున్నారని మండిపడ్డారు. నిర్మల్ మున్సిపాలిటీలో 42 ఉద్యోగాలకు మున్సిపల్ చైర్మన్ లక్షల రూపాయల డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఇప్పటికీ తిరిగి డబ్బులు చెల్లించలేదని మళ్లీ కొత్తగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ బుధవారం నిర్మల్ పర్యటనకు వస్తున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల ధర్మసాగర్ చెరువును పరిశీలించి రావాలని చెరువు కట్ట ఉండగా మళ్లీ చెరువు మధ్యలో మరో కట్టను వేసి చెరువు స్థలాన్ని మంత్రి అనుచరులు కబ్జా చేశారని కేటీఆర్ ధర్మసాగర్ చెరువును చూసి ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. కబ్జాల నుండి చెరువును కాపాడాలని డిమాండ్ చేశారు .రాహుల్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ను ప్రశ్నించారు. గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మర్చిపోయారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టి దేశంలోని పౌరుల్లో చైతన్యం తెచ్చి భారతీయులందరూ ఒకటేనని చాటారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రిలా వ్యవహరించే కేటీఆర్ స్థానిక మంత్రులు వృద్ధులు కార అంటూ ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దళిత కులస్తుడైన రాజయ్యను అకారణంగా ఉప ముఖ్యమంత్రి పదవి నుండి భర్త రఫ్ చేశారని నిర్మల్ లో జరిగిన తప్పులకు బాధ్యత వహించి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2014 ముందు 27 ప్యాకేజ్ ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభించారని, అప్పటినుండి ఇప్పటివరకు ఎలాంటి పనులను కేసీఆర్ ప్రభుత్వం చేయలేదని అన్నారు. మంత్రి కేటీఆర్ కు నిర్మల్ లో పర్యటించే అర్హత లేదని అన్నారు.ఈ కార్యక్రమం లో సారంగపూర్ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి ,మాజీ మునిసిపల్ వైస్ చైర్మన్ వాజీద్ అహ్మద్ సాదా సుదర్శన్ ,మామడ జెడ్పీటీసీ సోనియా సంతోష్ , అర్జుమన్ అలీ. జమీల్ ఖాన్. కిజర్.అజారుద్దీన్.ఓడ్నాల. రాజేశ్వర్. నందేడపు చిన్ను, గాజుల రవి కుమార్ ,ప్రతాప్ రెడ్డి , తదితరులు ఉన్నారు.