ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల కళాశాల,పాఠశాల మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అండర్ 14,19 స్పోర్ట్స్ మీట్ ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్సిఓ గోపీచంద్ నాయక్ మంగళవారం పరిశీలించారు.జిల్లాలోని 11 కళాశాలలు,పాఠశాలల నుండి 560 మంది క్రీడాకారు పాల్గొంటున్నారు.అండర్ 14 కబడ్డీ, వాలీబాల్ పోటీలను తిలకించారు.ఈ సందర్భంగా ఆర్ సి ఓ క్రీడాకారులతో మాట్లాడుతూ…చదువుతోపాటు క్రీడలు కూడా ప్రతి విద్యార్థికి ఎంతో దోహదపడతాయన్నారు. స్నేహపూరిత వాతావరణం లో క్రీడలు ఆడినప్పుడే విజయం దక్కుతుందన్నారు.ప్రతి క్రీడాకారుడికి గెలవాలన్న పోటీ తత్వం ఉంటుందని అయినా ఈర్ష దేశాలకు పోకుండా సంతోషంగా ఆటలు ఆడినప్పుడే విజయం సొంతమన్నారు. క్రీడాకారులు తమ ఆట ఆడ పైనే దృష్టి పెట్టి క్రీడలు ఆడాలని తెలిపారు. ఈనెల 2న ప్రారంభమైన స్పోర్ట్స్ మీట్ ఈనెల ఐదు తో ముగియనుంది. క్రీడాకారులకు కరచాలనం చేసి కబడ్డీ క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ గౌతమ్ కుమార్ రెడ్డి,ఏటీపీ సునీత,పిడి రాజేష్,పీఈటి కార్తీక్,ఆయా పాఠశాలల పీడీలు,పీఈటీలు ఉపాధ్యాయులు క్రీడాకారులు పాల్గొన్నారు.