మున్సిపల్ సాధారణ సమావేశంలో పలు తీర్మానాలకు ఆమోదం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశములో పలు పనులను తీర్మానం చేసి ఆమోదించారు. రానున్న బతుకమ్మ,దసరా పండుగల నేపథ్యంలో ఏర్పాట్ల గురించి చర్చించి,ఆమోదించడం జరిగింది.ఈ సమావేశములో మున్సిపల్ కమీషనర్ కల్లేడ రాజశేఖర్,మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,కౌన్సిల్ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు మున్సిపల్ మేనేజర్ శ్రీహరి, సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking