ఆరొవ తేదీన ప్రారంభం కానున్న స్పోర్ట్స్ స్టేడియంను పరిశీలించిన చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 03 అక్టోబర్ 2023: చేవెళ్ళ ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి తన సొంత నిధులు 50 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ స్టేడియంను మంగళవారం నాడు పరిశీలించి పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ఆరొవ తేదీన ప్రారంభానికి అందుబాటులోకి తీసుకు వస్తామని ఈ సందర్భంగా తెలిపుతూ స్టేడియంలో వాకింగ్‌ ట్రాక్‌ను కూడా సొంత నిధులతో పూర్తి చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు, దాంతోపాటు అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సైతం ఎంపీ రంజిత్ రెడ్డి పరిశీలించారు. ఈ స్టేడియం అందు బాటులోకి వస్తే విద్యార్థులు, స్థానిక యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉపయోగ పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడా రంగంలోనూ రాణించాలన్న సదుద్దేశ్యంలో స్టేడియం నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. స్థానికులకు ఉదయం, సాయంత్రం పూట వాకింగ్ చేసుకోవడానికి, వాలీబాల్, క్రికెట్ ఆడు కునేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేసినట్టు రంజిత్ రెడ్డి వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking