మినరల్ వాటర్ కు కట కట

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 21 మార్చ్ 2024:
మినరల్ వాటర్ కు కట కట
వీ ఆర్ ఫర్ సహాయోగ చారిటబుల్ ట్రస్టు వారు ప్రజా సౌకర్యార్థం తలపెట్టిన చలివేన్ద్రాలకు మినరల్ వాటర్ ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటూ చాలా చాలా ఆరటన పడవలసి వస్తున్న విషయం ప్రజలు గమనించి మాకు ఈ విషయమై సహకారన్నందించ వలసినదిగా కోరుతూ, విపత్కర పరిస్థితుల్లో కూడా కొంతమంది వారి స్వప్రయోజనార్థం కొరకు చలివెంద్రాలలో నుండి నీటిని బాటిల్స్ ద్వారా తీసుకెళ్ళి వారి వారి ఇంటిలో వాడు కొంటున్నారని ఇట్టి చర్యలు సమాజ హితంకు గొడ్డలి పెట్టు చర్యగా పరిగణిస్తు, మేము చేస్తున్న సేవ మణికొండలో గల పలు ప్రాంతం కూడలిలో తిరిగే బాటసారులకు ఎండాకాలం భానుడి ప్రతాపాన్ని తట్టుకొని సేద తీరడానికి మాత్రమేనని, ప్రజా సౌకర్యార్ధం ఏర్పాటు గావించిన చలివేంద్ర నీటి వనరులను త్రాగడానికి మాత్రమే ఉపయోగించు కోవాలని వీ ఆర్ ఫర్ సహాయోగ చారిటబుల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు వినమ్ర పూర్వక వినతి గావిస్తు, ఈ నీటి ఎద్దడిని తట్టుకొనే విషయమై వాటర్ వర్క్స్ అధికారులను కలసి వారి సంస్థ ద్వారా ప్రజల దప్పిక తీర్చే సౌకర్యార్థం చలివెంద్రాలకు మంచినీటి సరఫరా చేయాలని అధికారులను కోరుతు అందుకు ప్రతిఫలంగా తగిన మూల్యం చెల్లించ డానికి సంసిద్ధంగా ఉన్నామని తెలియ పరచడ మైనదని అందుకు స్థానిక మేనేజర్ స్ఫూర్తి ఈ విషయమై తగు ఏర్పాటు చేయడానికి శాయ శక్తుల ప్రయత్నిస్తానని తెలిపిందని ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking