జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మార్చి 21
జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి సమయానికి హాజరై ఆంగ్ల పరీక్షను పూర్తి చేసుకున్నారు.
విద్యార్థులు పరీక్ష రాసే సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. ప్రశాంతంగా పరీక్ష జరిగిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు.