ఖమ్మం ప్రతినిధి మార్చి 20 (ప్రజాబలం) ఖమ్మం లండన్ కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ని ఖమ్మం నగర కార్పొరేటర్ మిక్కిలేని నరేందర్ మంజుల వండర్ కిడ్స్ లక్ష్మీ శ్రీజ లు ప్రారంభించారు.ఈ పాఠశాల ఈ విద్యా సంవత్సరం ప్లే గ్రూప్ నుండి యూకేజీ వరకు బోధన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని పరిమిత సంఖ్యతో ఇంటర్నేషనల్ స్టడీతో తరగతి నిర్వహణ ఉంటుందని పాఠశాల కరస్పాండెంట్ రాహుల్ తెలిపారు.ఈ సంధర్బంగా లక్ష్మి శ్రీజ మాట్లాడుతూ శిశువు ఉన్నంతగా ఎదగడానికి సంస్కారంతో కూడిన మంచి విద్య బోధన చేసే పాఠశాల ఎంత అవసరమో అన్నారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మిక్కిలేని మంజుల మాట్లాడుతూ ఒత్తిడి లేని విద్య ప్లే వె మెథడ్ లో భోధనతో విధ్యార్దులకు ఆసక్తి కలిగిస్తుందన్నారు.లండన్ లో చదువుకున్నా రాహుల్ ఖమ్మంలో విధ్యార్దులను తీర్చిదిద్డీ ఇంకా మంచి స్థాయిలో ముందుకు వెళ్లాలని ఇలాంటి స్కూలు ఇంకెన్నో స్థాపించాలని ఆకాంక్షీంచారు