ఎస్టీయూ జగిత్యాల నేతల డిమాండ్
జగిత్యాల, మార్చి 9: లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన 4 డి.ఏ లను వెంటనే ప్రకటించాలని ఎస్టీయు జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ లు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ఎస్టీయూ భవన్లో జిల్లా శాఖ ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ లు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కేంద్రం డి ఏ లు ప్రకటించినప్పటికీ ,
రాష్ట్ర ప్రభుత్వం డీఏ లు ఇప్పటివరకు ప్రకటించక అన్యాయం చేస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు రావలసిన సరెండర్ లీవ్ బిల్ లు, మెడికల్ బిల్లులు, పిఆర్సి ఏరియర్స్ , జిపిఎఫ్ లోన్లు, పార్ట్ ఫైనల్ లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.
కోర్టు కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ వేసవిలోనే చేపట్టి పూర్తి చేయాలన్నారు.
జిల్లా అసోసియేట్ అధ్యక్షులు మేకల ప్రవీణ్, జిల్లా ఆర్థిక కార్యదర్శి బండి శ్రీనివాస్, వివిధ మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విద్యామని కృష్ణ , సలీం , మురళి, నరేష్, విష్ణు, దశరథ్ రెడ్డి, అశోక్, రాజేష్, సంద్య, సత్యనారాయణ , వెంకటేష్ తదితరులు ఉన్నారు.