ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 9:
తార్నాక నారాయణ ఈ టెక్నో పాఠశాల లో మహిళాదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారి యొక్క నృత్య ప్రదర్శన ద్వారా మహిళల యొక్క గొప్పదనాన్ని చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హెచ్ఎస్బిసి బ్యాంక్ ఆపరేషన్. మేనేజర్ వీణ తత్వ , పాఠశాల ఏ.జి.యం. బాల పరమేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నిరంగాలలో మహిళలు ఉన్నత స్థానాలలో ఉంటూ అటు గృహిణిగా, ఇటు వృత్తిపరంగా పని చేస్తూ క్రీడా రంగంలో కూడా ముందంజలో ఉండాలన్నారు. తెలంగాణ మరియు హైస్కూల్ ఆర్ అండ్ డి హెడ్ శివరంజని, ఈ-చాంప్స్ హెడ్. మహేశ్వరి, ఈ – చాంప్స్ కో- ఆర్డినేటర్ లక్ష్మీభవాని, ఈ- కిడ్జ్ ఆర్డినేటర్ నూర్, ఉప్పల్ ప్రిన్సిపాల్ వాణి,
డి.డి. కాలని ప్రిన్సిపాల్ సవిత, రామంతాపూర్ ప్రిన్సిపాల్ సరిత, నారాయణ గూడ ప్రిన్సిపాల్ అర్నిత కౌర్, తార్నాక ప్రిన్సిపల్ పర్వీన్, చార్మినార్ ప్రిన్సిపాల్ శారద, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.