జగిత్యాలలో నారీ శక్తి ఫిట్నెస్ రన్

 

జగిత్యాల, మార్చ్ 9: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినిలకు నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం నారీ శక్తి ఫిట్నెస్ రన్ నిర్వహించారు. స్థానిక మినిస్టేడియంలో నిర్వహించిన ఈ రన్ కై ఆ కళాశాల ప్రిన్సిపాల్ డా.గోలి శ్రీలత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ దేశంలో మహిళలకు ఉన్నతమైన స్థానాలు కల్పించాలని మహిళలు అన్ని రంగాల్లో ప్రగతిని సాధించాలని నేటి సమాజంలో స్త్రీకి సమానమైనటువంటి హక్కులు కల్పించి వారిని అన్ని రంగాల్లో ముందుకు వెళ్లేలా పాటుపడాలని అన్నారు. మహిళ సాధికారత కోసం ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.నేడు మహిళలు ప్రభుత్వ రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ అనేక ప్రగతిని సాధిస్తున్నారు అన్నారు.
ఈ సమాజ సృష్టికి మూలం స్త్రీ అని అన్నారు.స్త్రీ లేనిదే ఈ సృష్టి లేదని అన్నారు. మానసిక దృడత్వం కలిగిన స్త్రీలు దేనిలోనైనా విజయం సాధిస్తారని, అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. అనంతరం డా. అనూష, ఉపాధ్యాయులు బోనగిరి దేవయ్యలు మాట్లాడారు.
అనంతరం నారీ శక్తి ఫిట్నెస్ రన్ లో భాగంగా 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ బహుమతి పి.అలేఖ్య, ద్వితీయ బహుమతి ఏం.రచన, తృతీయ బహుమతి బి.శ్రావణి గెలుపొందారు వారికి అతిధులచే బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్రం జగిత్యాల వాలంటీర్ చింత అనిల్, ఏళ్ళంకి రాధా , కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హరిరామ్, కళాశాల లెక్చరర్లు, పేరెంట్ కమిటీ సభ్యులు గంగారెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking