ప్రభుత్వానికి కృతజ్ఞతలు
టిఎంయూ మెదక్ రిజియన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి
మెదక్ ప్రజాబలం ప్రతినిధి:టిఎస్ ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ మజ్దూర్ యూనియన్(టిఎంయూ) ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పి. శ్రీనివాస్ రెడ్డి (పిఎస్.రెడ్డి )తెలిపారు.శనివారం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. కార్మికులకు ఇవ్వాల్సిన 2017 పే స్కెల్ తో పాటు బాండ్స్ డబ్బులు కూడా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ నెల 12 న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా కార్మికులకు బాండ్స్ డబ్బులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వానికి మరింత మంచి పేరు వచ్చేదన్నారు. ఏదేమైనా కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్మికుల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తే ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రభుత్వానికి అండగా ఉంటామన్నారు. పే స్కేలు బాండ్స్ డబ్బులు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జనార్ లకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.
Prev Post
Next Post