కక్కిరేణీ లో నారి శక్తి ఫిట్నెస్ రన్

 

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో కక్కీరేణి గ్రామంలో ఈ రోజు మహిళలను ప్రోత్సహించుటకు అన్ని రంగాల్లో రాణించే విధంగా నారీ శక్తి ఫిట్నెస్ రన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది…
ఈ సందర్భంగా నెహ్రూ యువజన కేంద్రం యాదాద్రి భువనగిరి జిల్లా వాలంటర్ కంబాలపల్లి సంపత్ కుమార్ యాదవ్ గారు పాల్గొని వారు మాట్లాడుతూ మహిళలు ఆకాశంలో సగం – అవకాశంలో సగం అంటూ తమ శక్తి సామర్థ్యాలను పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుకు పోతున్న మహిళలకు ప్రోత్సాహం కల్పించుటకు నారి శక్తి ఫిట్నెస్ రన్ కార్యక్రమం నిర్వహించి పరుగు పందెంలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందివ్వడం జరిగిందని వారు తెలిపారు.
అలాగే సామాజిక కార్యకర్త వేముల సైదులు పాల్గొని వారు మాట్లాడుతూ పకృతికి రూపం – సృష్టికి మూలం మహిళలేనని అక్షరం నుండి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో ప్రగతి పదంలో ముందుకు నడుస్తూ సామాజికంగా ఆర్థికంగా , విద్య వైద్య మరియు క్రీడా రంగాలలోతోపాటు వివిధ ఉన్నత స్థాయిలో సంపూర్ణ మహిళా సాధికార దిశగా మహిళలను ప్రోత్సహించుటకు గ్రామాల్లో అనేక బహుమక కార్యక్రమాలు నిర్వహించుటకు ముందుకు రావాలని వారు కోరారు..
ఈ కార్యక్రమంలో బెలీద సంపత్ , ఈదులకంటి శివకుమార్ , సింగారం శ్రీనివాస్ , మహిళలు బుర్ర మంగ , పిట్టల వసంత , కన్నెబోయిన లక్ష్మి , చిల్ల దేవయాని , తిరుగుడు వరమ్మ , మంగమ్మ , సునీత , లక్ష్మీ , ప్రభావతి , అంజమ్మ , పద్మ , ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking