పెగ్గుపడ్డాకే దినచర్య…

 

👉 మినీ బార్లను తలపిస్తున్న బెల్ట్ షాపులు
👉తెల్లరకుండానే సుక్కేస్తున్న మందుబాబులు
👉ఏటా మృత్యువాత పడుతున్న సామాన్య జనం
👉ప్రజాబలం ప్రత్యేక కథనం…

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 15,( ప్రజాబలం ) అందోల్ నియోజకవర్గం లోని పలు మండలల గ్రామాలలో ఉదయం 6 గంటలకే బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి, ఉదయం టీ కాఫీలతో మొదలు పెట్టవలసిన దిన చర్య ఉతార్ పెగ్గులతో మొదలు పెడుతున్నారు,రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపుతామన్న విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారులు మరిచిపోయారా..? లేక మామూళ్ల మత్తులో మునిగి పట్టించుకోకుండా వదిలేస్తున్నారా…? అర్థం కాని పరిస్థితి బెల్ట్ షాపునిర్వాహకుడు ధీమాగా ఒక క్వార్టర్ కు పది రూపాయలు అధికంగా కట్టి తీసుకొస్తున్నాం, ఏదైనా ఉంటే ఎక్సైజ్ శాఖ అధికారులు,వైన్ షాప్ నిర్వాహకులు చూసుకుంటారు,మాకేం భయం లేదు అంటూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు,సామాన్య ప్రజలు పొద్దస్తమానం కష్టపడి సంపాదించిన సొమ్మును, బెల్ట్ షాపులకు దారపోస్తున్నారు, దీంతో వారి కుటుంబాలలో గొడవలు పడుతూ,కుటుంబ పోషణ భారమై,ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు,నియోజకవర్గంలోని గ్రామాలలో బెల్ట్ షాపులు నడిపిస్తే,బెల్ట్ షాపుల యజమానులపై అధికారులు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు ఎందుకంటే బెల్ట్ షాపుల యజమానులు ఇటు పోలీసులకు అటు ఎక్సైజ్ శాఖ అధికారులకు,పెద్ద మొత్తంలో మామూళ్లు ఇస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి,ఇప్పటికైనా సంబంధిత అధికారులు, స్పందించి బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి, తమ కుటుంబాలలో వెలుగులు నింపాలని,నియోజకవర్గంలోని వివిధ గ్రామాల మహిళలు, అధికారులను కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking