రెడీమిక్స్ ప్లాంట్ మూతతో హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

రాజేంద్రనగర్ ప్రజా బలం ప్రతినిధి 15 మార్చి 2025
పుపాలగూడ పరిధిలోనీ హాల్ మార్క్ విసినియా నివాసితులు గౌతమ్ కృష్ణారెడ్డి, అశోక్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రావు, జైపాల్ రెడ్డి, సాయి, ఆదినారాయణ, కవిత, రాధిక, నందన, మనోహర్, నిరంజన్, శ్రీకాంత్ మరియు మై హోమ్ అవుతార్ నివాసితులు నారాయణ, సుబ్బారెడ్డి, శ్రీధర్, రవి, మైధిలి, సుమిత్, ఇరు కమ్యూనిటీ ప్రజలు, సీనియర్ సిటిజన్స్ అపార్ట్మెంట్ వారు నిర్వహించిన సమావేశంలో ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులను పిలువడం జరిగినది, ఈ సందర్భముగా గడచిన మూడు సంవత్సరాలుగా ఈ అపార్ట్మెంట్స్ కి దగ్గరగా ఉన్న రెడీమిక్స్ ప్లాంట్ ను మూసివేయాలని పలుమార్లు అధికారులకు అనధికారులకు విన్నవించు కున్నప్పటికీ ఏ రకమైన చర్య తీసుకోక పోవడం చాలా శోచనీయమని వారు తెలిపారు. ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుల చొరవతో రెండు రోజుల క్రితం గౌరవ హైకోర్టు వారు రెడీమిక్స్ ప్లాంటును మూసివేయాలని తీర్పు వెలువరించిన దరిమిలా స్థానికులు హర్షం వ్యక్తపరిచారు. ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో నివసిస్తున్న ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా, ది సిటిజన్ కౌన్సిల్ వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ ప్రాంత ప్రజానీకానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నందుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలిపారు. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న అద్వానంగా ఉన్న రోడ్డు మరియు పరిశుభ్రత సమస్యలను కూడా పరిష్కరించ డానికి సహకరించాలని ఈ సందర్భముగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ది సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి బొమ్ము ఊపెండర్నాథ్ రెడ్డి, కౌన్సిల్ సభ్యులు బొడ్డు శ్రీధర్, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, సుమనళిని తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking