సమస్యల సుడిగుండంగా మణికొండ

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 15 మార్చి 2025
మణికొండ బీ.ఆర్.ఎస్ పార్టీ వారు గుడ్ మార్నింగ్ మణికొండ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున మై హోమ్ అవతార్ మరియు హాల్ మార్క్ విసినియా అపార్ట్మెంట్స్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంగా ఆ ప్రాంత ప్రజలు పలు సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు.
1. హెవీ ట్రక్కులు తిరిగిన కారణంగా రహదారి అద్వాన స్థితిలో ఉన్నదనీ, ఇక్కడ ప్రతి రోజు 30 స్కూల్ బస్సులు మరియు ఇతర వాహనమల రాక పోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. కావున మున్సిపాలిటీ వారు తక్షణమే స్పందించి ఇక్కడ రోడ్డు మరమ్మతలు చేపట్టాలని కోరారు.
2. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించిన కాండూట్ పై నుంచి మురుగు నీరు ప్రవహిస్తున్నది. దీనివల్ల రాబోయే కాలంలో గండిపేట నుంచి వచ్చే మంచినీరు కలుషిత మయ్యే ప్రమాదం ఉన్నది కావున హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వారు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోగలరు.
3. ఒకప్పుడు శుద్ధమైన మంచి నీరు మరియు చేపల కేంద్రంగా ఉన్న ముష్కిన్ చెరువు కలుషితమై దుర్గంధం వెలజలుతూ అన్యక్రాంతం అవుతున్నది కావున హైడ్రా డిపార్ట్మెంట్ మరియు మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వారు తక్షణమే స్పందించి ముష్కిన్ చెరువు యొక్క ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ లు నిర్ధారించి ఆ ప్రాంతాన్ని సుందరీ కరణ కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నారు.
ఇట్టి కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ, కుంభగల్ల ధనరాజ్, గుట్టమీది నరేందర్, అందే లక్ష్మణ్ రావు, ముత్తంగి లక్ష్మయ్య, ఉపేందనాథ్ రెడ్డి, కిరణ్ యాలాల, సుమనళిని, మహేందర్, బొడ్డు శ్రీధర్, కందాడ ప్రవీణ్ కుమార్, తిరుపతి తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking