బాలానరసింహ కు దళిత రత్న అవార్డు

హైదరాబాద్ మే 4 (ప్రజా బలం ప్రతినిధి );ముషీరాబాద్ నియోజకవర్గం గంగపుత్ర కాలనీకి చెందిన బర్గెల బాల నరసింహకు దళిత రత్న అవార్డు దక్కింది.తెలంగాణ మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ లెజిస్టేటివ్ కౌన్సిల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో సీనియర్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు.సామాజిక సేవ రంగంలో దాదాపు రెండు దశాబ్దాల నుండి దళిత బహుజన వర్గాల సంక్షేమ అభివృద్ధికి ఐక్యతకు కృషి చేస్తున్న బాల నరసింహకు ఈ అవార్డును అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ సందర్బంగా బాల నరసింహ మాట్లాడుతూ తనకు దళిత రత్న అవార్డు ఇచ్చి సన్మానం చేసిన మాల సంక్షేమ సంఘం కార్యవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking