ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 05 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈ నెల 8 న రంగ సాయి ప్రేమ్ సాగర్ భూలక్ష్మి దంపతులచే చేప మందు కార్యక్రమం ఎర్పాటు చేసినట్లు నిర్వహకులు తెలిపారు. బుధవారం దండేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో చేప మందు ఎర్పాట్లపై సమావేశం నిర్వహించారు.ఈ నెల 8 న శనివారం ఉదయం 7:30 కు ఉబ్బసం వ్యాధిగ్రస్తుల కోసం ఉచిత చేప మందు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఒకరోజు ముందు వచ్చే వారికోసం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,డిసిసి అధ్యక్షురాలు,కొక్కిరాల సురేఖల అధ్వర్యంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంపిటిసి సభ్యులు ముత్యాల శ్రీనివాస్,గడ్డం త్రిమూర్తి తెలిపారు.మరింత సమాచారం కోసం గుండ రవింధర్ సెల్ 9866885308,పసుపునూటి తిరుపతి,9908401985, పొన్నం చిన్న గౌడ్ 9440707416 ముత్యాల శ్రీనివాస్, 9959769143 చరవాణిలలో సంప్రదించాలని సూచించారు.