వాటి విలువ 6,75,000/- రూపాయలు
ఒకరు అరెస్ట్,పరారిలో ముగ్గురు నిందితులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 05 : మంచిర్యాల జిల్లాలోని నీల్వాయి పోలీసులు, వ్యవసాయ అధికారులు నకిలీ పత్తి విత్తనాల గురించి నమ్మదగిన సమాచారం అందుకున్న పోలీసులు మరియు వేమనపల్లి మండలం వ్యవసాయ అధికారితో కలిసి వేమనపల్లిలో ఫెర్రీ పాయింట్‌కి వెళ్లి ఎద్దుల బండి ద్వారా 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్న నిందితుడు ఏ-1 కోలా సాయికిరణ్ తండ్రి రమేష్, వయస్సు 23 సంవత్సరాలు,కులం కాపు గ్రామం కోటపల్లి మండలంలోని సిరొంచ, మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా పట్టుకోవడం జరిగింది.పోలీస్ వారిని చూసి ఏ-2 కోలా రమేష్ తండ్రి లచ్చన్న,వయస్సు 50 సంవత్సరాలు,కులం కప్వార్ కోటపల్లి,సిరొంచ గడ్చిరోలి జిల్లా ని పారిపోవడం జరిగింది.ఇట్టి నకిలీ విత్తనాల విలువ రూ.6,75,000/- ఉంటుంది.నకిలీ పత్తి విత్తనాలను మంచిర్యాల జిల్లాలో విక్రయించి అధిక లాభం పొందాలి అనుకొన్నారు.ఏ1ను విచారించగ నకిలీ విత్తనాలు ఏ-3 సుమిత్ తండ్రి అస్తి,ఏ-4 జంగా సంపత్ తండ్రి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన తాలా కేకేడే,ద్వారా సరఫరా చేయబడ్డాయి అని తెలిపాడు.ఏ-1ను నకిలీ పత్తి విత్తనాలతో పాటు ఒక ఎద్దుల బండిని పోలీస్ స్టేషన్ నీల్వాయికి తీసుకొచ్చి కేసు నమోదు చేయడం జరిగింది.
నకిలీ విత్తనాలు మరియు నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్, కానిస్టేబుల్,రాజేందర్, రాజశేఖర్ లను సీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డ్ అందచేయడం జరిగింది.పట్టుబడిన నిందితుని పేరు
ఏ-1.కోలా సాయి కిరణ్ తండ్రి రమేష్,వయస్సు 23 సంవత్సరాలు,కులం కాపు కోటపల్లి,సిరొంచ,మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా.
పరారిలో ఉన్న నిందితుల వివరాలు,ఏ-2.కోలా రమేష్ తండ్రి లచ్చన్న,వయస్సు 50 సంవత్సరాలు,కులం కప్వార్ గ్రామం కోటపల్లి మండలం సిరొంచ,జిల్లా గడ్చిరోలి
ఏ-3.ఏ-3. సుమిత్ తండ్రి అస్తి,మహారాష్ట్ర రాష్ట్రం.
ఏ-4.జంగా సంపత్ తండ్రి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన తాలా కేకేడే.
స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు
1) 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాల 7 సంచులు యొక్క విలువ మొత్తం 6,75,000/- రూపాయలు,
2) ఒక ఎద్దుల బండి
3) రెండు ఎద్దులు. పత్రికా సమావేశంలో మంచిర్యాల డిసీపి అశోక్ కుమార్, ఐపీఎస్.అడిషనల్ డిసీపి అడ్మిన్ రాజు,జైపూర్ ఎసీపి వెంకటేశ్వర్లు,చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ పాల్గొన్నారు.