కల్వర్టుపై ప్రమాదకరంగా గుంత

 

– పట్టించుకోని అధికారులు పాలకులు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 6 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: అందోల్ నియోజకవర్గం లోని అల్లాదుర్గ్ మండల పరిధిలో గల ముప్పారం గ్రామానికి వెళ్లే చక్కని బీటీ రోడ్డుపై నిర్మించిన కల్వర్టుపైన పెద్ద గుంత( 5, ఫీట్ల లోతు వరకు ) ఏర్పడి ప్రమాదకరంగా మారిన అధికారులకు గాని, పాలకులకు గాని,పట్టింపు లేకుండా పోయింది, కల్వర్టుపై ఏర్పడ్డ గోతిలో పడి వ్యక్తులు క్షతగాత్రులు అయితే కానీ అధికారులు పాలకులు అటువైపుగా మర మతులు చేసేలా లేరని, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఈ రోడ్డు గుండా నిత్యం అనేక వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి, చిన్నపాటి వ్యయంతో ఈ గుంతకు మరుమతులు చేసే అవకాశం ఉన్న ఎవరికి పట్టకపోవడం ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు
ఈ రహదారి గుండానే అధికారులు ముప్పారం వైపు వెళ్తున్న ఈ కల్వర్టు పైన ప్రమాదకరంగా ఏర్పడిన గుంత వారికి కానరావడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు, అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ రోడ్డు కల్వర్టు పైన ఏర్పడిన గుంతను, వెంటనే పూడ్చి ఈ రోడ్డు వెంబడి వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్భయంగా ప్రయాణించేలా చూడాలని సంబంధిత అధికారులను ప్రజలు కోరుతున్నారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking