అందోల్ నియోజకవర్గ ప్రతినిధి మార్చి 6 ( ప్రజాబలం )సంగారెడ్డి జిల్లా: అందోల్ నియోజకవర్గం లోని చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ జేఎన్టీయూ కళాశాలలో హ్యూమానిటీస్ అండ్ సైన్స్ విభాగం ఇనిస్ట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సైన్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి. నరసింహ,మాట్లాడుతూ సైన్స్ మానవ పురోగమనానికి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు, చక్రం సృష్టించడం నుంచి బాహ్య అంతరిక్షం అన్వేషణ వరకు వ్యాఖ్యల అభివృద్ధి నుంచి, కృత్రిమ మేధస్సు వరకు, సైన్స్ ప్రపంచాన్ని విస్తృతంగా ప్రభావితం చేస్తుందని చెప్పారు, మరోవైపు( సి ఆర్ సి )చైర్మన్ హ్యూమానిటీస్, అండ్ సైన్స్ విభాగాధిపతి, డాక్టర్ విజయకుమార్, సివి రామన్, చిత్రపటానికి పూలమాల వేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్యఉద్దేశం విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి కల్పించి కొత్త ప్రయోగాలకు ప్రేరణ కల్పించడం వైజ్ఞానిక విజయం గురించి అవగాహన కల్పించడం లక్ష్యమని చెప్పారు, ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్, ఆచార్య రాఘవేంద్రరావు, విభాగాధిపతులు ఆచార్య రజనీష్, ఆచార్య జోషి ప్రసాద్, ఆచార్య బేబీ శాలిని, బోధన బోధనేతర సిబ్బంది, ప్రథమ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు..