ఎస్సీ వర్గీకరణ కు చట్టబద్ధత కల్పించాలి
మార్చి 15 న జాతీయ రహాదారి దిగ్బంధం
మాదిగ సంగ్రామ యాత్ర కు మద్దతుగా బేడబుడగజంగం నాయకులు
ఎస్సీ వర్గీకరణకు చేయకుంటే బిజెపి కేంద్ర,రాష్ట్ర నాయకులకు తీరగనివ్వం
.. ….. భైరపోగు శివకుమార్ మాదిగ
మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి
సంగారెడ్డి మార్చి 2 ప్రజ బలం ప్రతినిధి:
ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ మైసగల్ల బుచ్చంద్ర మాదిగ ఆధ్వర్యంలో ..మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు….మాదిగల సంగ్రామ యాత్ర మూడవ రోజు బుదేర నుండి యాత్ర కోనసాగగా సదాసివపేట్ అంబేడ్కర్ కూడలి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బేడబుడగజంగం జిల్లా అధ్యక్షుడు అర్జున్, కార్యదర్శి మల్లేష్, నాగేష్, భిక్షపతి లు స్వాగతం పలికారు.
యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాని ఉద్దేశించి మాదిగ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి భైరపోగు శివకుమార్ మాదిగ మాట్లాడుతూ. అధికారం లోకి వచ్చిన వంద రోజులలో SC వర్గీకరణ చేస్తాం అని ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్న బిజెపి పార్టీ 9 సంవత్సరాలు గడుస్తున్న ఇంకా వర్గీకరణ మీద ఎలాంటి ప్రకటన చేయకపోవడం మాదిగలు అంటే చిన్నచూపుగా చూస్తున్న బిజెపి పార్టీకి రాబోయే రోజుల్లో తగిన బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. వర్గీకరణ చేయకుండా జాప్యం చేస్తున్న కేంద్రం ప్రభుత్వం పై నిరసన గా ఈ మాదిగల సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. జాతి భవిష్యత్తు కోసం జరిగే ఈ సంగ్రామ యాత్రలో అందరు పాల్గొని మార్చి 15 న జరగబోయే హైదరాబాద్ – ముంబాయి జాతీయ రహదారి దిగ్బంధ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యాత్ర కు ప్రముఖ న్యాయవాది అలిగే నాతానియెల్ సంఘీభావం తెలియచేశారు.
ఈ కార్యక్రమం లో పొట్టోల వెంకటేష్ ఎమ్మెస్ పి జిల్లా ఇంచార్జి,
అబ్రహం మాదిగ జిల్లా నాయకులు, జైరాజ్ ఎమ్మెస్పీ జహీరాబాద్ నాయకులు, దేవుల పల్లి మహేష్ ఎమ్మెస్ఎఫ్ జిల్లా కన్వీనర్, అరకల రమేష్ ఎమ్మెస్ ఎఫ్ సీనియర్ నాయకులు, యాదగిరి విహెచ్పిఎస్ నాయకులు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.