గణేష్ మండపాల్లో అన్నదానాలను ప్రారంభించిన దయాకర్ రెడ్డి

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 22 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన పలు వినాయక మండపాలను పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. సంభాని నగర్, ముస్తఫానగర్, పంపింగ్ వెల్ రోడ్ మామి ళ్లగూడెం, బి.కె. బజార్ తదితర ప్రాంతాల్లోని గణేష్ మండపాల్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు తొలుత గణేశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మంజిల్లా ప్రజలందరినీ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా చూడాలని వినాయకుని వేడుకున్నారు. ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు దయాకర్ రెడ్డిని ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కారించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking