గడప గడపకు పిఎస్ఆర్ కార్యక్రమలు డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 26 : మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు వికాస్ నగర్ లో గడప గడపకు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు నిర్వహించారు.ఈ సందర్బంగా కాలనిలో ప్రతి గడప గడపకు వెళుతూ సమస్యలు తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు చేస్తున్న సేవ కార్యక్రమాలను వివరించి చెప్పారు.ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని వివరిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూన్న అవినీతిని ప్రజలకు వివరించారు.అనంతరం కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు వివరించారు.రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం,సాధించబోతుందని,గ్రామాల్లో నెలకొన్న సమస్యలన్నీ తీర్చుతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking