రానున్న పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించండి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఉమ్మడి ఆదిలాబాద్ లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీమతి అత్రం సుగుణ గారి హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ హస్తం గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు ఎన్నికల ప్రచార శంఖారావం పురించారు.
వార్డు నెం 33 భాగ్యనగర్ (రాధాకృష్ణ మందిర్)
బంగల్ పేట్,మోతి నగర్ బాగులవాడ,గాయత్రీ నగర్,అస్ర కాలనీ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.పలు వార్డుల్లో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలను గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 నెలలకే 5 హామీలను అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.కాంగ్రెస్ పార్టీ సాధ్యమైన హామీలనే ఇస్తుందని ,ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని అన్నారు.తెలంగాణ రాష్ట్రం లో ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని,ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై నమ్మకం ,విశ్వాసం ఉంచారని అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, ఉచిత కరెంటు, 500 కి గ్యాస్ సిలిండర్ విజయవంతంగా అమలు చేస్తున్నాం, రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రుణమాఫీ అమలు చేసి తీరుతాం,అని తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి రాష్ట్రంలో అధికారంలో కి వచ్చామని ,రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ని గెలిపించుకొని,
రాహుల్ గాంధీ ని ప్రధాని గా చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు తో పాటు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్. మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల గణేష్ ,ఎఎంసీ మాజీ చైర్మన్ చిలుక రమణ ,పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను,మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కుడుకల గంగాధర్ ,మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య ,గాంగోని బురాజ్ ,అప్పాల ప్రభాకర్ ,పరంకుశ వంశీ నయన్నగారి మురళి ,మొయిన్,ఆకుల హరీష్ ,నిజాం అన్వర్ ,వాజీద్ ఖాన్ ,ఎస్.పి రాజు ,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking