ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఏప్రిల్ 29:
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో లో మల్కాజ్గిరి నియోజకవర్గ స్థానానికి దాఖలైన నామినేషన్లను పరిశీలన (స్కూటీని) అనంతరం మల్కాజ్గిరి 114 మంది అభ్యర్థులు 177 నామినేషన్ దాఖలు చేయగా పరిశీలన లో 77 మంది అభ్యర్థుల నామినేషన్ లు తిరస్కరించగా,37 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించడం జరిగిందని, ఈ రోజు జరిగిన విత్ డ్రా లో 15 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోగా, 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని,ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో సింబల్ ల ను కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు.ఎన్నికల బరి లో ఉన్న అభ్యర్థుల వివరాలు తెలుపనైనది.
1.పట్నం సునీత మహేందర్ రెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 2. ఈటల రాజేందర్, భారతీయ జనతా పార్టీ, 3. రాగిడి లక్ష్మారెడ్డి, భారత రాష్ట్ర సమితి 4.శీలం అనిత, బహుజన్ సమాజ్ పార్టీ 5. కొండా అప్పారావు,రాష్ట్ర సామాన్య ప్రజా పార్టీ, 6. చామకూర రాజయ్య అలియాస్ పిడికిలి రాజు, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా 7. జువ్వా ఫణికుమార్, జై భారత్ నేషనల్ పార్టీ 8. పెద్దపల్లి సందీప్, భారతీయ యువకుల దళం 9.బోయిన దుర్గాప్రసాద్ యాదవ్, ధర్మ సామాజ్ పార్టీ 10.నక్క యాదీశ్వర్, తెలంగాణ పబ్లికన్ పార్టీ11. నర్రా సుఖేందర్ రెడ్డి, విద్యార్థుల రాజకీయ పార్టీ 12. కంటే సాయన్న, స్వతంత్ర అభ్యర్థి 13. చిరిపిరెడ్డి రమేష్, స్వతంత్ర అభ్యర్థి 14. దొంతుల బిక్షపతి స్వతంత్ర అభ్యర్థి 15. పెసరి కాయల పరీక్షిత్తురెడ్డి, స్వతంత్ర అభ్యర్థి 16.బంజపల్లి సుధారాణి స్వతంత్ర అభ్యర్థి 17.మౌతం సంపత్ ,స్వతంత్ర అభ్యర్థి 18. రాజేష్ మిశ్రా శివ్, స్వతంత్ర అభ్యర్థి 19. తల్లాడ వెంకటేశ్వర్లు స్వతంత్ర అభ్యర్థి 20. పెండ్యాల శేష సాయి వరప్రసాద్, స్వతంత్ర అభ్యర్థి 21. భారత సుదర్శన్, స్వతంత్ర అభ్యర్థి 22. ఆర్. సుబెండర్ సింగ్, స్వతంత్ర అభ్యర్థి. మల్కాజిగిరి జిల్లా నియోజకవర్గ ఎన్నికల బరిలో ఈ అభ్యర్థులు ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
Next Post