రాజన్న సిరిసిల్ల జిల్లా, 29 ఏప్రిల్ 2024, ప్రజా బలం ప్రతినిధి,
రోజున ఉదయం 11.00 గంటలకి శివనగర్ లోని శివాలయంలో హైదరాబాదు పత్రగాట్ కు చెందినా వస్త్ర వ్యాపారాలు వారికీ అవసరమైన వస్త్ర ఉత్పత్తి ఆర్డర్స్ ను సిరిసిల్ల మ్యాక్స్ మరియు SSI యూనిట్లు మరియు ఇతరులకు ఇచ్చి వారి నుండి వస్త్రాన్ని కొనుగోలు చేయుటకై buyer seller meet ఏర్పాటు చేయడం జరిగినది.
ఇట్టి buyer seller meet సిరిసిల్ల లోని వస్త్ర వ్యాపారాలు, ఆసాములు పాల్గొని వారు ఉత్పత్తి చేసే వివిధ రకాల వస్త్రాల వివరాల గురించి వివరించడం జరిగినది.
అదేవిధంగా పత్రగాట్ కు చెందినా వస్త్ర వ్యాపారాలు మాట్లాడుతూ తమకు అవసరమైన వివిధ రకాల వస్త్ర ఉత్పత్తి కై సిరిసిల్లలోని ఆసాములు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసారు. అలాగే మార్కెటుకు అనుగుణంగా వస్త్ర ఉత్పత్తి కొరకు సంప్లిల్స్ తయారు చేసి ఇవ్వవలసినదిగా కోరియున్నారు. సంపిల్స్ కు అనుగుణంగా ఆర్డర్స్ ఇచ్చి వారి నుండి వస్త్రం కొనుగోలుకై సుముఖత తెలియజేసియున్నారు.
ఇట్టి సమావేశంలో శ్రీ యం. వెంకటేశం, ఉప సంచాలకులు (చే&జౌ), హైదరాబాదు గారు మరియు శ్రీ వి. అశోక్ రావు, ఉప సంచాలకులు (చే&జౌ), వరంగల్ గారు పాల్గోన్నడం జరిగినది, శ్రీ యం. సాగర్, సహాయ సంచాలకులు (చే&జౌ), రాజన్న సిరిసిల్ల గారు. అదేవిధంగా పత్రగాట్ కు చెందినా దాదాపు (10) వస్త్ర వ్యాపారాలు, చేనేత మరియు జౌళి శాఖ సిబ్బంది, ఇతరులు పాల్గొనడం జరిగినది.