- టిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ వలసవాది.
- డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.
- హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వోడితల ప్రణవ్.
జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 29 మంగళవారం జరుగబోయే జన జాతర సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కరీంనగర్ డిసిసి అధ్యక్షుడు మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ బాబు తో పాటు ఆయన సభా స్థలిని,హెలిప్యాడ్ ను పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 60 వేలమందితో జమ్మికుంట లో జన జాతర సభ.వేసవి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశాం.హుజురాబాద్ నుండి జన జాతర సభను భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని అన్నారు. కేంద్రంలోని మోడీ చేస్తున్న అవినీతి పాలనపై,50 రోజుల్లో ధరలను తగ్గిస్తానని చేయలేదు.ధరలు ఆకాశం పైకి పోయాయి.పెట్రోల్,డీజల్ నిత్యావసర వస్తువుల ధరలు అన్ని పైకి వెళ్ళాయి.మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి హయంలో 20 వేల కోట్ల రూపాయలను కొట్టేశారు. భారతదేశపు ఆస్తిని అదానికి అంటగట్టాడు.సీబీఐ,ఈడి,ఐటి దర్యాప్తు సంస్థలను దగ్గర పెట్టుకొని అడిస్తున్నాడు. ఎలక్ట్రో లోబాండ్ లను విడుదల చేయడం లేదు.

అర్హులు కానీ వారు కూడా ఎన్నికల బాండ్ లను కొన్నారు. 20 కంపెనీ లు అలాగే ఉన్నాయి ఇదికాద అవినీతి. శరత్ చంద్ర లాంటి వాళ్ళు క్విడ్ ప్రో కో చేశారు.కప్పం కట్టందే కేసులు మాఫీ కాలేదు. దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది మోడీ మాట్లాడుతుంది. బిజేపి అభ్యర్థి బండికి చదువు లేదు ఏం లేదు పొద్దున్న లేస్తే దేవుడి పేరు తప్ప ఏం లేదు.మొన్నటి ఎన్నికల్లో ఒక నియంతను బొంద పెట్టారు.రేపు కేంద్రంలో కూడా ఇలాగే జరుగుతుంది. కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు గురించి మాట్లాడిన కేటీఆర్, నువ్వు రాజకీయాలు కు రానప్పుడు చొప్పదండి నియోజక వర్గంలో కేసిఆర్ తో బి ఫాం వేసిన వ్యక్తి రాజేందర్ రావు.2009 లో కరీంనగర్ నుండి పోటీ చేసిన వ్యక్తి రాజేందర్ రావు,పరిచయం లేని వ్యక్తి అతను.కరీంనగర్ కు నువ్వు ఒక వలస వాది. హన్మకొండ నుండి వచ్చిన వినోద్ కుమార్ వలస వాది ని తెచ్చుకున్నారు.ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి రాజేందర్ రావు. సర్పంచ్ కూడా గెలవనోడు ఎంపీ గా పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు దొరకని పరిస్థితి లో ఉంది బిఆర్ఎస్ పార్టీ.రాముని మీద రాజకీయం చేస్తే ఓట్లు పడవు.ఓట్ల కోసం దేవుని అక్షింతలు ఇంటి ఇంటికి పంపించారు.వారి మీద వారికే నమ్మకం లేక దేవుళ్ళను వాడుకుంటున్నారు.