మైనారిటీలకు అండగా నిలుస్తా రఘురాం రెడ్డి

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా సత్తుపల్లి మైనారిటీ వర్గాలకు అండగా నిలుస్తామని, అధైర్యపడొద్దని కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. సోమవారo ఆయన సత్తుపల్లి లో జరిగిన క్రిస్టియన్ మైనారిటీ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి తో కలిసి మాట్లాడుతూ.. బీజే పీ మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుల రాజకీయాలు చేయడం బాధాకరమని అన్నారు. అనంతరం ..భారీ విజయం సాధిస్తారని పాస్టర్లు రఘురాం రెడ్డిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమoలో విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking