పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి

  • జనరల్ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా,జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్

పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని జనరల్ పరిశీలకులు డాక్టర్ ప్రియాంక శుక్లా అన్నారు.
సోమవారం రోజున వీసీ మీటింగ్ హాల్లో పోలీస్ అబ్జర్వర్ డాక్టర్ రామేశ్వర్ సింగ్, వ్యయ పరిశీలకులు దృవ్ భోళా, మనోజ్ అలోస్ లక్రా, జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్ వివిధ రాజకీయ పార్టీ ల అభ్యర్థులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల విధి విధానాలు వివరించారు. జిల్లాలో ఫ్లయింగ్ స్కాడ్ టీములు పర్యవేక్షణ చేస్తుంటాయని తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రాజకీయ పార్టీలు అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని అన్నారు. ఎం సి ఎం సి సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేయడం సంబంధిత అభ్యర్థి ప్రచార ఖర్చులో వాటిని లెక్కించడం జరుగుతుందని తెలిపారు.సోషల్ మీడియాలో అభ్యర్థుల రాజకీయ ప్రకటనలు వంటివి సకాలంలో ఆమోదిస్తూ మంజూరు చేయడం జరుగుతుంది. పోలీస్ పరిశీలకులు మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీ లు ఎన్నికల సంఘం నియమనిబంధనల కు లోబడి వ్యవహరించాలన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ఆఫ్ కండక్ట్ ప్రకారం పార్టీల అభ్యర్థులు నడుచుకోవాలన్నారు. పార్టీలు అభ్యర్థులు ముందస్తుగా సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకొని సమావేశాలు, ర్యాలీలు తీసుకొని నిర్వహించాలన్నారు. . కరపత్రాలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ,ముద్రించినట్లు ప్రింటర్ మరియు ప్రచురణ కర్తలు ఎన్నికల ప్రాతినిధ్యం చట్టం ప్రకారం నిబంధనలు పాటించాలన్నారు.సువిధ యాప్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, రాజకీయ పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking