కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు శ్రీహరిరావు అరెస్ట్

 

ప్రజా బలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు దిలావార్పూర్ మండలo గుండంపల్లి పంపు హెలిప్యాడ్ వద్ద అరెస్ట్ చేసి సారంగపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
1.గుండంపల్లి లోని కాలేశ్వరం ప్యాకేజ్ నెంబర్ 27 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును పూర్తికాని ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారు అని
2.దిలావర్పూర్ మండల కేంద్రంలో పచ్చని పంట పొలాల మధ్యలో విషవాయువులను వెలువరించి ప్రజల ప్రాణాలకు,పచ్చటి పంటపొలాలకు హాని కలిగించే ఇథనాల్ ప్రాజెక్టును రద్దు చేయాలని అడిగేందుకు
3.నిర్మల్ మున్సిపాలిటీలో అన్యాయంగా అక్రమంగా 42 ఉద్యోగాలను అమ్ముకున్నారని తేలినప్పటికి చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అని రాష్ట్ర మంత్రి కేటి రామారావు కు అడిగేందుకు ప్రశ్నించేందుకు వెళ్లిన నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీహరి రావు ఇతర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేశారు.అని
శ్రీహరిరావు అక్రమ అరెస్ట్ ని నిరసిస్తూ సారంగపూర్ పోలీస్ స్టేషన్ ముందు కొంత సేపు ధర్నాకు దిగారు.
శ్రీహరి రావు తో అరుగుల రమణ ,సారంగపూర్ మాజీ మండల జెడ్పీటీసీ లు బొల్లోజి నర్సయ రోడ్డ మారుతి,అబ్దుల్ హది,న్యాయవాది అల్లూరి మల్లరెడ్డి ,మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ వజీద్ అహ్మద్ ఖాన్,పొడెళ్లి గణేష్, వివిధ మండల నాయకులు ,కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking