స్కూల్ పిల్లలకు బూట్ల పంపిణీ

రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 అక్టోబర్ 2023: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ.ఎన్.టీ డాక్టర్ జీ.వీ.యస్. రావు వారి ఆర్థిక సహాయ సహకారాలతో గతంలో ఎన్నో జిల్లా పరిషత్ ప్రాధమిక పాఠశాలలో, ప్రాధమిక హై స్కూల్లలో మరియు మండల పరిషత్ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకి ఉచితంగా బూట్లూ, సాక్స్ లు, కంపాక్స్ బాక్స్ లతో కూడిన బిస్కట్ ప్యాకెట్ల పంపిణీ చేసినట్లుగానే, బుదవారం రోజున కూకట్ పల్లిలోని రావూస్ ఈ.ఎన్.టీ దవాఖానలో చిన్న పిల్లల ఈ.ఎన్.టీ శాస్త్ర చికస్తలోనే ప్రఖ్యాతి గాంచిన డాక్టర్ శ్రీ రావు మరియూ వారి సుపుత్రుడు మాస్టర్ ఆర్ణవ్ రావుల అమృత హస్తాలతో మణికొండ మున్సిపల్ కౌన్సిల్ పరిధి నెక్నంపూర్ లోని మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలోని 138 మంది విద్యార్థినీ విద్యార్థులకి ప్రధానోపాధ్యాయుడు మహేష్, టీచర్లు అమల, సత్యవాణిల సమక్షంలో పంపిణీ చేయడం జరిగినది, ఈ శుభ ఘడియలలో ప్రముఖ పంటి డాక్టర్ శ్రీకాంత్, వీ.ఆర్.ఫోర్.యూ సీనియర్ సిటిజన్ యూనిట్ అద్యక్షుడు బత్తుల బాపూజీ, దిలీప్ కక్కడ్, శివ రామ కృష్ణ, శ్రీనివాస్, ప్రదీప్ రావు, సాంబశివరావు, అందె లక్ష్మణ్ రావు, సాదు నాగేంద్ర రావు, విజయలక్ష్మి, కృషీ గ్రూప్ ఫౌండేషన్ సంగసేవకురాలు పట్లోల్ల రుపా రెడ్డి, బీ.ఉమా మహేశ్వర రావు, సీ.ఎల్.కే. రెడ్డి తది తరులు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking