ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 16 (ప్రజాబలం) ఖమ్మం ఆర్టీవో ఆఫీస్ రోడ్డు నుండి కొత్త మున్సిపాలిటీ రోడ్డు వద్ద యూనిక్ ఫైనాన్స్ సర్వీసెస్ యూజ్డ్ కార్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఆఫీసు నూతనంగాప్రారంభించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ నూతన వాహనాలకు, మరియు ఇతర వాహనాలకు ఫైనాన్స్ సౌకర్యం ఇతర ఫైనాన్స్ ఆఫీసుల కంటే దీటుగా, పోటీ తట్టుకోవాలంటే ఆకర్షించే పథకాలను పెట్టడం మంచిదని, తక్కువ వడ్డీతో తక్కువ లాభాలతో వాహనదారులకు ఫైనాన్స్ సౌకర్యం కల్పించాలని సూచించారు. కార్యాలయ నిర్వాహకులు మాట్లాడుతూ అన్ని రకాల వాహనాలకు తక్కువ వడ్డీకే ఫైనాన్స్ సౌకర్యం కల్పించబడుతుందని, తాకట్టులో ఉన్న వాటిని విడిపించి ఫైనాన్స్ సౌకర్యం కల్పించగలమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె పతే మహమ్మద్ అంబటిపూడి సత్యం రాయల ఉపేందర్, సింగం వెంకన్న పుచ్చకాయల వంశీ తుపాకుల రమేష్ మారిశెట్టి కృష్ణవంశీ సింగం యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు