కమీషనరేట్ లో ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహణ

 

అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం

సీపీ రామగుండం ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 16 : పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా తెలుగు,ఇంగ్లీష్,ఉర్దూ భాషలలో ఆన్ లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం “పోలీస్ ఫ్లాగ్ డే ” సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31వ (తేది: 21-10-2024 నుండి 31-10-2024) వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ తెలియజేశారు.ఓపెన్ హౌస్ కార్యక్రమాలు నిర్వహించి పోలీసు విధులు, పోలీసులు వినియోగించే ఆయుధాలు,సాంకేతిక వినియోగం,ప్రజల రక్షణ లో పోలీసుల సేవలు, పోలీసులు చేసిన ప్రతిభ, త్యాగాలు మొదలగునవి విషయాలను ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది.ఆన్ లైన్ లో ఈ వెబ్ సైట్ ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది.వ్యాసరచన పోటీలు మూడు భాషల్లో అనగా తెలుగు,ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో అభ్యర్థులు పాల్గొనవచ్చును. వ్యాసరచన పోటీలు కేటగిరీల వారి గా కేటగిరి-1: స్టూడెంట్స్ కు ఇంటర్మీడియట్ వరకు (విచక్షణతో కూడిన మొబైల్ వాడకం),
కేటగిరి-2:-డిగ్రీ అండ్ పై స్టూడెంట్స్ కు (తెలంగాణను డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నా పాత్ర) అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు” అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వర్తించడం జరుగుతుంది ఆన్లైన్లో 24 అక్టోబర్ 2024 వరకు సమర్పించవచ్చును. ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను కమిషనరేట్ లో బహుమతుల ప్రధానం చేసి, తదుపరి ఈ ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో, కమీషనరేట్ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని అన్నారు.పోలీసులకు వ్యాసరచన పోటీలు: కేటగిరి-1: కానిస్టేబుల్ అధికారి నుండి ఏ ఎస్సై స్థాయి అధికారి వరకు(సమాజంలో పోలీసు ప్రతిష్టను మెరుగుపరచడంలో నా పాత్ర),కేటగిరి-2: ఎస్సై స్థాయి అధికారి మరియు పై స్థాయి అధికారులకు (దృఢమైన శరీరంలో దృఢమైన మనసు) వ్యాసరచన పోటీలు నిర్వహించబడతాయని తెలియజేశారు.ఈ వ్యాసరచన పోటీలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో నిర్వహించాలని, 500 పదాలకు మించకుండా వ్యాసరచనలో పాల్గొని,ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురికి అవార్డుల ప్రధానం, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత లభిస్తుందని తెలియజేశారు.
రక్తదాన శిబిర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.పోలీస్ అమరవీరుల స్మరిస్తూ పోలీస్ వారి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ కార్యక్రమం నిర్వహణ మరియు పోలీస్ అమరవీరుల కుటుంబాలకు దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుంది.షార్ట్ ఫిలిమ్స్,ఫోటోగ్రఫీ పోటీలు :-విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు,సైబర్ నేరాలు,కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ,ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను కమీషనరేట్ లో బహుమతి ప్రధానం చేస్తూ,రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. ఫోటోలు,వీడియోలు ఈనెలతేది :-20-10-24 లోపు స్పెషల్ బ్రాంచ్ (ఎన్ ఐబీ) కార్యాలయంలో అందించాలి.ఈ నెల 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు పబ్లిక్ స్థలాల్లో, పోలీస్ అమరవీరుల గురించి తెలుపుతూ పోలీస్ కళా బృందం తో పాటల కార్యక్రమాలు నిర్వహించడం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ ల పరిదిలోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది.ఈ నెల అక్టోబర్ 21 న పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు”పోలీస్ అమరవీరుల సంస్మరణలో ఘనంగా నివాళులు అర్పిస్తూ”స్మృతి పరేడ్”పోలీస్ ఫ్లాగ్ డే”కార్యక్రమాలు నిర్వహిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్ తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking