ఇల్లందు ప్రతినిధి జనవరి 25 (ప్రజాబలం) ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జక్కంపూడి వెంకటేశ్వర్లు, జక్కంపూడి కోటయ్య మాతృమూర్తి జక్కంపూడి శ్యామలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. అంతేకాకుండా గత నెలలో
భార్య చంద్రమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈరోజు జరిగిన శ్యామలమ్మ దశదినకర్మ కార్యక్రమాలలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి వారికి మనోధైర్యం కల్పించారుఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ కేవలం ఒకే ఒక నెలలో ఒక వ్యక్తి తన భార్యను తన తల్లిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఆ లోటు ఎవరు పూడ్చలేనిదని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఎలాంటి దుర్వ్యసనం లేని మంచి మనిషి జక్కంపూడి అని, అలాంటి వ్యక్తికి ఇలాంటి కష్టం రావడం దురృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బానోతు నరసింహ నాయక్, భూక్య నాగేంద్రబాబు, ఎస్.కె రబ్బానీ పాషా శీలం పుల్లయ్య పాటిబండ్ల ప్రసాదు, అంబడిపూడి భద్రయ్య, అంబడిపూడి మల్లికార్జున్ , చల్ల మల్లయ్య అంబటిపూడి వెంకటేశ్వర్లు అంబడిపూడి వెంకటయ్య, జక్కంపూడి నగేష్ జక్కంపూడి ఉపేందర్, పల్లె వెంకట రాములు బాదావత్ నాగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు