ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ ఫిబ్రవరి 20 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని హనుమంతుపల్లి గ్రామానికి చెందిన గురువారం రోజున ఉదయం 5 గంటలకు నస్పూరి గౌరయ్య అనే 49 సంవత్సరాల వ్యక్తి స్లాబ్ రాడ్డుకు నైలాన్ తాడుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మృతుడు ముంబై లో కూలి పని చేసుకొని బ్రతికేవాడు. గత సంవత్సరం క్రితం ముంబై నుండి వచ్చి కూతురు పెళ్లి చేసి గ్రామంలో ఇల్లు కట్టుకున్నాడు.వాటి కోసం సుమారు 5 లక్షల రూపాయల వరకు అప్పు చేసాడు.అవి తీర్చడం బారమై ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని మృతుని భార్య సత్తవ్వ పిర్యాదు చేయగా లక్షెట్టిపేట ఎస్సై-2 రామయ్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.