ఎమ్మెల్యే మృతికి ఎంపీ నామ సంతాపం
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 23 (ప్రజాబలం)
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ యువ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి మృతి పట్ల బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసి, సంతాపం తెలిపారు. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ సీనియర్ ఎమ్మెల్యే అయిన తన తండ్రి సాయన్న మృతి నుండి ఇంకా కోలుకొక ముందే లాస్య మృత్యువాత పడటం ఎంతో బాధ కలిగిస్తుందన్నారు. ప్రజా సేవలో సాయన్న వారసత్వాన్ని కొనసాగిస్తూ కంటోన్మెంట్ ప్రజల మన్ననలు పొందిన లాస్య నందిత ఆకస్మిక మరణం అత్యంత బాధాకరమన్నారు. పిన్న వయసులోనే ఎమ్మెల్యే గా గెలిచి రాజకీయంగా ఎదుగు తున్న లాస్యను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించడం దురదృష్ట కరమన్నారు. వారి కుటుంబా నికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆమె మరణం కంటోన్మెంట్ ప్రజలకు, బీఆర్ ఎస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆమె మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనో దైర్యాన్ని ప్రసాదించాలని నామ ప్రార్థించి, భరోసా ఇచ్చారు