పాఠశాలల్లో సెక్యూరిటీ పెంచాలి ..

 

చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వారు వస్తున్నారని వార్తలపై ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి…

ఆ వార్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి

…/ బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు సాయి భాష

సంగారెడ్డి పిబ్రవరి 23 ప్రజ బలం ప్రతినిది:
* సంగారెడ్డి జిల్లాలో చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వారు వస్తున్నారని వార్తలు వస్తున్నాయి… వారు వచ్చిన రాకున్నా పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా.. వారిపై ఒక…! కన్ను వేసి ఉంచాలని బీసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు సాయి బాషా అన్నారు.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బిసి విద్యార్థి సంఘం కార్యాలయం లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు… ముఖ్యంగా ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు అన్న విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సూచించారు. అవసరమైతే పాటశాల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని పెంచాలి …నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు. గుర్తు తెలియాలని వ్యక్తులను పాఠశాల వద్దకు అనుమతించవద్దని , విద్యార్థులను తల్లిదండ్రులకు చెప్పకుండా ఎక్కడికి పంపరాదని సూచించారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే వేసవి కాలం వచ్చేసింది కావున పాఠశాల ఆవరణలో మంచి నీళ్ళు సదుపాయాన్ని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలు ఏర్పాటు చేయాలన్నారు. చిన్న పిల్లల్ని ఎత్తుకుపోయే వారు వస్తున్నారని వార్తలపై వారికి విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ,,SC ST BC విద్యార్థి సంఘం జిల్లా ఉపధ్యక్షులు కసిని మని,P, రావి, రాజశేఖర్, దుర్గేష్, రావి, శ్రీకాంత్, సాగర్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking