తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు భాగంగా వైద్యరోగ్య దినోత్సవం

 

అమ్మ ప్రతినిధి జూన్ 14 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు గిరిజన సంబురాలు -3వ రోజు కార్యక్రమాలు వైద్యారోగ్య దినోత్సవాన్ని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాల – ఖమ్మం హెచ్ ఓ ఆర్ ఎస్ బస్వాపురం నందు బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు మరియు సిబ్బందితో ఆరోగ్యం మరియు పచ్చదనం- పరిశుభ్రత “పై అవగాహన కార్యక్రమము నిర్వహించడమైనది మరియు విద్యార్థుల ఆరోగ్యం పట్ల గిరిజన సంక్షేమశాఖ చేపడుతున్న చర్యలు – కార్యక్రమాలను పాఠశాల సమావేశ మందిరంలో విద్యార్థులు వారి తల్లి దండ్రలతో సమావేశం నిర్వహించి (పై విషయాలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సోమ్లా వివరించారు.ఈ కార్యక్రమములో పాఠశాల విద్యార్థులు డాక్టర్లు, నర్సులు రోగులుగా వేషధారణలు ధరించి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. రోగులకు వారి అనారోగ్యానికి మందులు పంపింని చేశారు.ఈ కార్యక్రమానికి విచ్చేచిన తల్లిదండ్రులు, గ్రామస్థులు విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాద్యాయులు బి.కృష్ణారావు, టి.మురళీధర్ రావు , బి.సక్రం, డిప్యూటీ వార్డెన్ బి. వెంకటేశర్లు, మరియు సి ఆర్ టీ ఉపాధ్యాయులు ఈ భాస్కర్, నాగేశ్వరరావు, ఐ నెహ్రూ, బి అశోక్ కుమార్, ఏ రింకిషన్,4 వ తరగతిఉద్యోగులు, తల్లి దండ్రులు, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking