కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలు.

 

▪️జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు

▪️క్షేత్ర స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటు

▪️ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్‌ సెంటర్‌ టీ-హబ్‌ల ఏర్పాటుతో ఉచితంగా పరీక్షలు.

ఖమ్మం ప్రతినిధి జూన్ 14 (ప్రజాబలం) ఖమ్మం
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు పూర్తిగా రివర్స్‌ అయిపోయిందని, నేను వస్తా బిడ్డో సర్కారు దవాఖానకు అని పాడుకునే రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోతెరఫీ వార్డు లను మంత్రి పువ్వాడ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సమకూర్చిన న్యూట్రిషన్ కిట్స్ లను పంపిణీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking