శివంపేట ప్రజాబలం ప్రతినిధి:శుక్రవారంనాడు మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రం లో శ్రీ బగలాముఖి అమ్మ వారి విగ్రహ ప్రతిష్ఠాపన అత్యంత వైభవంగా సాగింది. బగలాముఖి ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారి నేతృత్వంలో ట్రస్ట్ సభ్యులు శ్రీ దర్శనం శర్మ గారు, శ్రీ రమేష్ గుప్తా గారు మరియు ఇతర సభ్యులు ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో రేయనక పగలనక కష్ట పడి భక్తి పూర్వకంగా ఈ రోజు అమ్మ వారిని అధిష్ఠప చేశారు.
ఈ అద్భుతమైన కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి గీతా మూర్తి దంపతులు, మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ మతి సునీత లక్ష్మరెడ్డి మరియు ఇతర నేతలు, వేద పండితులు, భక్తులు పాల్గొని అమ్మ వారి ఆశీస్సులు పాందారు. గీతా మూర్తి గారు, సునీత లక్ష్మ రెడ్డి గారు, శాసన సభ్యులు మదన్ రెడ్డి గారు, మరియు ఇతర నాయకులు ఇదే ప్రాంగణం లో ఏర్పాటు చేసిన యాగ శాల లో పూర్ణా హుతి కార్యక్రమాన్ని కూడా చూసి యాగ భస్మాన్ని ధరించారు. బగలాముఖి అమ్మ వారు శత్రువుల నుండి వచ్చే ఉపద్రవాలను ఆరికడ్తారని విశేషం గా చెప్పుకుంటారు.