ఉద్దేశపూర్వకంగానే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుపై విమర్శలు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 : మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన గొడవను కొంతమంది ఉద్దేశపూర్వకంగా కుల సంఘాలకు ఆపాదిస్తున్నారని నస్పూర్ మున్సిపల్ ప్లోర్ లీడర్ సురిమిల్ల వేణు అన్నారు.శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఐ. బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సీలకు రాజకీయంగా ఎన్నో పదవులు ఇప్పించిన మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావును దళిత వ్యతిరేకి అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.దళితుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రేమ్ సాగర్ రావుపై దళిత వర్గాలు చేస్తున్న ఆరోపణలను వ్యతిరేకించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో, బ్లాక్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ అంగిడి రాజేష్,ఎస్సీ సెల్ నస్పూర్ పట్టణ అద్యక్షులు చిలుక మల్లేష్, నస్పూర్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అట్కపురం సతీష్, లింగయ్య, మారు మల్లయ్య,మని,సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking