మణికొండ సమస్యల పరిష్కారం కొరకు డిమాండ్

రాజేంద్రనగర్ నియోజకవర్గ 22 ఫిబ్రవరి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ మునిసిపాలిటీ పరిధిలో పార్టీ సీనియర్ నాయకుడు ముత్తంగి లక్ష్మయ్య, బొడ్డు శ్రీధర్ ల ఆద్వర్యంలో బీ.ఎం శ్రేయస్ అపార్ట్మెంట్, మణికొండ స్టీల్స్, పైప్ లైన్ ప్రాంతం, రత్నదీప్ సూపర్ మార్కెట్, గ్రీన్ లివింగ్ పరిసర ప్రాంతాలలో ప్రజాభిప్రాయ సేకరణ గావించడం జరిగింది. అందులో భాగంగా వీధి దీపాలు మొత్తంగా వెలుగడం లేదనీ, మంచి నీటి సరఫరా సరిగా రావడం లేదని, వీధి కుక్కల బెడదతో పిల్లలు పెద్దలు భయ బ్రాంతులకు గురవుతున్నారని, పైప్ లైన్ రోడ్డు నుండి కాలనీ లోకి వెళ్లే దారి మలుపులో చెత్త చెదారం వేయడం వలన కుప్పి తొట్టిగా మారి దుర్గంధంతో పాటు రాక పోకలకు ఇబ్బంది ఉంటుందని అదే చోట జలచరాలైన చేపల అమ్మకాల వలన దుర్గంధంతో పాటు చిన్నా పెద్ద వాహనాలు ఆగి ఆగి పోవడం వలన విద్యార్థులను తీసుకెళ్ళే బస్ లలో విద్యార్థులు సక్రమముగా బస్ ఎక్కలేక అవస్తులను ఎదుర్కుంటున్నారని కావున పాఠశాల విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా అవసరమున్న చోట స్పీడ్ బ్రేకర్లు వేస్తే బాగుంటుందని స్థానికులు తమ అభిప్రాయాన్ని తెలియ పరుస్తు, పై సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేసినారు. ఇట్టి కార్యక్రమంలో బీ.ఆర్.ఎస్ పార్టీ మణీకొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, రాజేంద్ర ప్రసాద్, మాల్యాద్రి నాయుడు, యాలాల కిరణ్, సుమనళిని, శ్రీనివాస్ చారి, బీ.ఎం శ్రేయస్ హోమ్స్ అధ్యక్షుడు వంశీతో పాటు స్థానికులు నాగేశ్వర్ రావు, సురేష్, స్వామి, మహేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

             

Leave A Reply

Your email address will not be published.

Breaking