నాంపల్లి ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్, ఫిబ్రవరి 22:కనీస వసతుల పరిశీలన, భోజన పరిస్థితి పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసారు. ఇట్టి కమిటీలో జిహెచ్‌ఎంసి చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి హెడ్ గా, అడిషనల్ కమీషనర్లు పంకజ (హెల్త్), వేణుగోపాల్ రెడ్డి (అడ్వర్టైజ్మెంట్)సభ్యులు గా నియమించారు.కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కమిటీ సెక్రటేరియట్ వెనుక భాగంలో మింట్ కాంపౌండ్ లక్డికాపూల్ వద్ద శనివారం అన్నపూర్ణ కేంద్రాలను సందర్శించి అక్కడ ఉన్న కనీస వసతులు భోజన పరిమాణం నాణ్యతను పరిశీలించారు.
అన్నపూర్ణ కేంద్రాలు నిరుపేదలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు జిహెచ్‌ఎంసి వ్యాప్తంగా ఉన్న రూ.5/- లకే అన్నపూర్ణభోజనం నిరుపేదలకు వర ప్రసాదంగా మారిందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణకేంద్రాలఆధునీకరణకు చర్యలు చేపట్టింది.

కనీస వసతులతో పాటుపౌష్టికాహారం అందించేందుకు జిహెచ్‌ఎంసి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కమిషనర్ గారి ఆదేశాల మేరకు తాను కమిటీ సభ్యులు శనివారం మింట్ కాంపౌండ్, లక్డికాపూల్ సమీపంలోని అన్నపూర్ణ క్యాంటీన్ల స్థితి, ఆహార నాణ్యత ను తెలుసుకోవడానికి అకస్మికంగాతనిఖీలునిర్వహించారు.లక్డికాపూల్ వద్ద గల అన్నపూర్ణ క్యాంటీన్ లో భోజనం చేసి నాణ్యత బాగుందని సంతృప్తిని వ్యక్తం చేశారు. క్యాంటీన్లపరిస్థితిని పరిశీలించి, రెండు ప్రదేశాలలో మరమ్మతులు చేపట్టాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీప్రాంతంలోని వివిధ ప్రదేశాలలో క్యాంటీన్ల స్థితిని నివేదించడానికి కమిటీ ఇంజనీర్ల బృందాన్ని నియమిస్తున్నట్లు వివరించారు..