నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీఓ 220 ను రద్దు చేయాలని డిమాండ్

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీఓ 220 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష కార్యక్రమానికి హాజరై సంఘీభావం ప్రకటించిన బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్

ఈ సభ ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతూ :
కెసిఆర్ వచ్చాక కొత్తరూపం ఎత్తారు.
భూములు అమ్ముకొని బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారు.
జోన్ కన్వర్ట్ చెయ్యడం…
అసైన్డ్ భూములు లాక్కోవడం.
పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం పేరుతో కెసిఆర్ భూములు పేదవారి చేతిలో లేకుండా చేస్తున్నారు.
భూప్రక్షాలన, ధరణి తీసుకువచ్చి వేల ఎకరాల అన్ ఐడెంటిఫీడ్ లాండ్ లను కెసిఆర్ బినామీ పేర్లకు మార్చుకున్నారు. లక్షల కోట్ల భు కుంభకోణం చేస్తున్నారు.
నిర్మల్ పురాతన పట్టణం.
ఎన్నో ఏళ్ల కిందనే సోఫీ నగర్ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ జోన్ గా ప్రకటించారు. ఇప్పుడు అక్కడ పరిశ్రమలు మూతపడడంతో ఆ భూములు అమ్ముకోలేరు అని వారిని భయపెట్టి మంత్రి అనుచరులు అతి తక్కువ ధరకు కొనుగోలుచేశారు. భూములు వారి చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతాన్ని రెసిడెన్షియల్, కమర్షియల్ జోన్ గా మార్చారు.
గ్రీన్ జోన్ లోనున్న మంజులపూర్, తల్వెద గ్రామాలను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చి మట్టిని నమ్ముకొని బతుకుతున్న రైతుల కళ్ళలో మట్టి కొట్టారు.
రైతుల కళ్ళల్లో మట్టి కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని మహేశ్వర్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తున్నారు.
మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు.
రింగ్ రోడ్డు ఎటు వస్తుంది తెలుసుకొని రైతుల దగ్గర ముందే తక్కువ ధరకు కొనుక్కొని రైతులను మోసం చేసి.బి.ఆర్.ఎస్ నాయకులు బాగుపడుతున్నారు.
గ్రీన్ బెల్ట్, కన్సర్వేషన్ జోన్ లో ఉన్న భూములను కన్వర్ట్ చేసుకొని కోట్లు సంపాదిస్తున్నారు.
మాస్టర్ ప్లాన్ పేరిట రైతుల భూములు లాక్కుంటున్నారు.
ప్రభుత్వం, నాయకులు ఉన్నది ప్రజలకు న్యాయం చెయ్యడానికి.
మహేశ్వర్ రెడ్డి ని ఇబ్బంది పెడుతున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకువచ్చేది ప్రతిపక్షాలు.
ప్రజలకు విశ్వాసం కలిగించేది మేము. కానీ కెసిఆర్ మాత్రం చక్రవర్తిలాగా, నిజాం సర్కార్ లాగా వ్యవహరిస్తూ.. నేను యజమానినీ ప్రజలు జీతగాళ్లు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
హైదరాబాద్ చుట్టూ 5800 ఎకరాలు పేదలకు ఇచ్చిన భూములు కెసిఆర్ లాక్కొన్నాడు. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా మారిందని రోజు వార్తలు వస్తున్నాయి.
బడంగిపేటలో ఎన్నో ఏళ్ల క్రితం ఇచ్చిన భూములలో 24 ఎకరాల భూమి గుంజుకున్నారు. ఒక్కో ఎకరం 20 కోట్ల విలువ చేస్తుంది.
కెసిఆర్ మాటలు తియ్యగా ఉంటాయి. చేతలు ఇబ్బందిపెడుతున్నాయి.
నిర్మల్ లో పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం లేదు. వచ్చినా కూడా పరిశ్రమలు పెట్టుకొనే వారు భూములు కొనుక్కుంటారు మీరెందుకు మద్యలో.
రైతుల మీద జలగల్లాగా బ్రతకవద్దు.
2023 డిసెంబర్ వరకే మీకు అధికారం అప్పగించారు.
నీకేం 40 ఏళ్లకు ఇవ్వలేదు.
నువ్వేం నిజాం సర్కార్ వు కాదు.
కెసిఆర్ పోలీసులతో ఎన్నాళ్ళు రాజ్యం నడుపుతావు.
ముఖ్యమంత్రి జిల్లాకు వస్తె రెండు రోజుల ముందు, కేటీఆర్ వస్తె 24 గంటల ముందు, మంత్రులు వస్తె పొద్దున్నే ప్రతిపక్షాల నేతలను అరెస్ట్ చెయ్యడం
నిత్యం కార్యం అయ్యింది.
ప్రజాస్వామ్యాన్ని ఖతం చేస్తున్నారు.
నిరసన తెలిపే హక్కు కాలరాస్తున్నారు.
పౌరుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈ ప్రభుత్వంను గద్దె దించేందుకు ప్రజలందరూ ఐక్యం కావాలి.
నిర్మల్ సంఘటన తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేస్తాం.
నిన్ను ఎండగడతం.నీ పార్టీని బొంద పెడతామని హెచ్చరిస్తున్నాము.
నిర్మల్ రైతులకి యావత్ తెలంగాణ అండగా ఉంటుంది అని నిర్మల్ గడ్డ మీద నుండి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రేపు నిర్మల్ బంద్ కు పిలుపు
మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా రేపు నిర్మల్ బంద్ కు పిలుపునిచ్చిన బీజేపీ నేతలు. కావున ప్రజలు, వ్యాపారస్తులు, ఈ బంద్ కార్యక్రమానికి సహకరించగలరు.
ఈ కార్యక్రమంలో నాయకులు అయ్యన్న గారి భూమయ్య, రావుల రాంనాథ్, రమాదేవి, రామారావ్ పటేల్, సామ రాజేశ్వర్ రెడ్డి, చిట్యాల సుహాసిని రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి , హారినాయక్, జానుబాయి, కార్యకర్తలు,మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking