తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన పించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

తొలి బహుజన రాజ్యాన్ని స్థాపించిన తొలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.17వ శతాబ్దంలోప్రస్తుత జనగామ జిల్లా రఘునాధపల్లి మండలం, ఖి లాషా పూర్ గ్రామంలో నా సగొని ధర్మన్న గౌడ్, సర్వమ దంపతులకు ఆగస్టు 8 1650 లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు జన్మించారు. పాపన్న గౌడ్ చిన్నతనంలోని ఆనాటి సాంఘిక ఆర్థిక, పాలన పరిస్థితులను పరిశీలించేవాడు. యుక్త యసుకు వచ్చాక కులవృత్తి అయిన కళ్ళ గీత కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. అతని స్నేహితులైనచాకలి సర్వన్న,మంగలి మాసన్న,కుమ్మరి గోవిందు, జక్కుల పెరమాల్, దూదేకుల పీర్, కోత్వాల్ సాహెబ్ ల తో కలిసి ఉండేవాడు.తు రుష్క సైనికులు నిత్యం ప్రజల దగ్గర శిస్తు వసూలు చేసుకుని వెళ్తున్న క్రమంలో దారిలో పాపన్న గౌడ్ దగ్గర కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళ్లేవారు, సరేలే డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు వారు వారి రాజులకు లెక్క చెప్పేది ఉంటది కదా అని అడిగేవాడు కాదు. ఒకరోజు పాపన్న స్నేహితుడు ఒకరు నిత్యం కల్లు తాగి డబ్బులు ఇవ్వకుండా వెళుతున్నారని అనగా సైనికులలో ఒకడు కన్నడానికి కాలు లేపగా కోపోద్రికుడైన సర్వాయి పాపన్న గౌడ్ తాను కల్లు గీసే కత్తితో సైనికుడి తల నరికాడు. తిరగబడ్డ సైనికులను చితకబాది వారు వసూలు చేసిన శిస్తు డబ్బులును, వారి గుర్రాలను తీసుకొనిస్నేహితులతో కలిసి పాపన్న గౌడ్ ఇంటికి చేరాడు. అప్పటినుండి స్నేహితులతో కలిసి దారి కాచి తురు స్క సైనికులు పేద ప్రజల నుండి వసూలు చేసిన ధనాన్ని లాక్కొని పేద ప్రజలకు పంచేవారు పాపన్న గౌడ్ గారు ధైర్యాన్ని సేవా నిరతి ని జనగామ గ్రామ ప్రాంత ప్రజలు ఆయనకు అభిమానులుగా మారారు. యువకులు ఆయన వెంట నడవడం ప్రారంభించారు. పాపన్న గౌడ్ గారు వారికి యుద్ధ విద్యలు నేర్పి అనతి కాలంలోనే మూడు వేలకు పైగా మందిని తన సైనికులుగా మలుచు కున్నాడు. తెలంగాణ ప్రాంతంలో అప్పటి పాలకులైనమొగలు రాజుల పాలన ను అంతమందించాలని తాబేదర్, జమిందార్, జాగీర్దారులు,భూస్వాములు చేసే దురాగతాలను అంతం చేసి ఎలాగైనా గోల్కొండ కోటను వశం చేసుకొని పాలించాలని నిర్ణయించుకొని ఆ దశగా 12 వేలకు మందికి పైగా సైనికులను తయారు చేసుకున్నాడు. పాపన్న గౌడ్ గారికీ అప్పటికి అతను చేతిలో ధనము గాని అధికారం కానీ లేవు.
ధైర్యమే ఆయనను ముందుకు నడిపింది
ఏదైనా సాధించగలనన్న ధైర్యమే ఆయనను ముందుకు నడిపింది. తన సైన్యంతో మొగల్ సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు అయిన ఖిలాషా పూర్ ను స్వాధీనం చేసుకొని 1675లో అంటే తన 25 ఏళ్ల ప్రాయంలోనే సర్వం పేటలో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యంపై తిరగబడిన పాపన్న గౌడ్ ఒక్కో ప్రాంతాన్ని జయిస్తూ విజయదుర్గాలను నిర్మించాడు. ఒక సామాన్యమైన వ్యక్తి దుర్భేద్యమైన కోటలను వశపరచుకోవడం అతని వ్యూహానికి నిదర్శనం. సర్వంపేట లో మొదలైన ఆయన విజయ పరంపర లో దాదాపు 30 కోట్లకు పైగానే చేయించాడు. చ12,000 మంది సైనికులతో కలిసి గోల్కొండ కోటను కూడా జయించి ఏడు నెలల పాటు పరిపాలించారు. తెలంగాణ ప్రాంతంలో తిరుగు లేని మొగలుల సామ్రాజ్యాన్ని ఢీకొన్న భారత దేశ తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ భువనగిరి కోటను రాజధానిగా చేసుకుని 30 సంవత్సరాలకు పైగా ప్రజారాజక పాలన కొనసాగించాడు ప్రజలతో ఎలాంటి శిస్తు లు వసూలు చేయకుండా, పాలన అవసరాలకు సుబేదార్, జమీందారుల ఖజానాపై తన సైనికులతో దాడి చేయించి తీసుకొచ్చిన ధనముతో ప్రజా సంక్షేమం కోసం ఖర్చు పెట్టేవారు.ఒక సామాన్య సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తి
గోల్కొండ కోటను జయించడానికి జీర్ణించుకోలేని ఢిల్లీ మొగల్ సుల్తాన్ పాపన్న గౌడ్ పై యుద్ధం చేశారు. పోరాటంలో పాపన్న గౌడ్ గారిని జయించలేని మొగల్ సుల్తాన్ పాపన్న గౌడ్ ఉండే రహస్య ప్రదేశాన్ని అతని స్నేహితుల ద్వారా తెలుసుకొని సైన్యంతో చుట్టుముట్టి అతన్ని అంత మొందించి తలను ఢిల్లీ మొగల్ సుల్తాన్ కు పంపారని గోల్కొండ కోటకు మొండా న్ని వేలాడదీశారని అంటుంటారు. 17వ శతాబ్దంలోనే సామాన్య కుటుంబంలో జన్మించి న శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు అట్టడుగు వర్గాలను కనీసం దరికి చేరని అగ్రవర్ణాల పెత్తనాన్ని అడ్డుకోవాలంటే బహుజనుల మద్దతు ఎంతైనా అవసరమని భావించి తన స్నేహితులైన మంగలి మాసన్న,కుమ్మరి గోవిందు, సాకలి సర్వన్న, జక్కుల పెరుమాళ్, దూదేకుల పీర్, కోత్వాల్ మీరు సాయబులతో కలిసి తమ చుట్టుపక్కల జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి శ్రీకారం చుట్టారు. నేటి బహుజనులు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారిని ఆదర్శంగా తీసుకొని బహుజన రాజస్థాపనకు ముందుకు కదలాలి.

Leave A Reply

Your email address will not be published.

Breaking